- Advertisement -
నీ కవిత్వంలో
ఆచరించే ఒక్క అక్షరం ఉన్నా
ఆదరించే కాలం
దగ్గరలో ఉన్నట్లే….
ఆసక్తిని, నిస్సహాయతను
పాపం పుణ్యం తెలియని
కవితం మెడలో వేసి
ఊరేగిస్తూ….
ఊగుతూ పోతుంటే…..
నీ సమస్య గౌరవించపడి
కాలం నిన్ను గుర్తిస్తుందా?
ఎదుటవారి ఆలోచన రూపంలో?
చందలూరి నారాయణరావు,
9704437247
- Advertisement -

