ఉచిత గాలీకుంటు వ్యాది నిరోదక టీకాలను సద్వినియేాగం చేసుకోండి

– జుక్కల్ వెటర్నరి వైద్యుడు పండరినాథ్.
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పశుపోషణ చేస్తున్న రైతులు గాలీకుంటు వ్యాది నుండి పశువులను రక్షించుకునేందుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు జుక్కల్ మండలం కేంద్రలలో ఎఫ్ఎమ్డి ఉచిత వ్యాదినిరోదక టీకాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల ప్రజాప్రతి నిధులు విండో చైర్మేన్ శివానంద్ పశువులకు టీకా వేసి సోమవారంనాడు ప్రారంబించారు. ఈ సంధర్భంగా ముఖ్యఅథితిగా బీఆర్ఎస్ నాయకుడు నీలుపటేల్, కాంగ్రేస్ నాయకుడు దాదారావ్ పటేల్ పాల్గోన్నారు. వైద్యుడు పండరి మాట్లాడుతు జూలై 31 నుండి ఆగస్టు మాసం చివరి వారంవరకు టీకాలు  వేయడం జర్గుతుందని సూచించారు.   పశువులకు వ్యాది సోకితే లక్షణాలు నోటీనుండి చొల్లుకారడం జర్గుతుందని, కాళ్ల సందులలో, నోట్లో బోబ్బలు రావడం చిట్లి పోవడం, జ్వరం రావడం, పాల ఉత్పత్తి తగ్గుతుందని అన్నారు, పుట్టిన దూడలకు నెలకు ఒకటి, నాలుగు నెలకు రెండవ దఫా టీకా వేయించాలని,  వెంటనే వ్యాది సోకిన వాటికి మంద నుండి వేరు చేసి గుర్తించి టీకాలు వేయించుకోవాలని తెలిపారు, అలాగే  మండలంలోని పాడీ రైతులు సద్వినియేాగం చేసుకోవాలని పేర్కోన్నారు. కార్య క్రమంలో మండల వెటర్నరి ఆసుపత్రి  సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Spread the love