ఉమామహేశ్వరం దేవాలయానికి బంగారు గొలుసు విరాళం

నవతెలంగాణ – అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి హైదరాబాద్ వాస్తవ్యులు రవికాంత్ గౌడ్, సతీమణి రమ్యలు బుధవారం రూ.80. వేలు విలువచేసే బంగారు చైన్ విరాళంగా ఇచ్చారు. గతంలో వీరు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి మొక్కారు. మొక్కులు తీరడంతో బంగారం గొలుసును  ఇచ్చారు. దేవస్థాన కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్,  ఈవో శ్రీనివాసరావు లు వారిని సన్మానించారు. దాతలు విరాళాలు ఇచ్చి దేవాలయం అభివృద్ధికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు
Spread the love