కంప్యూటర్ యుగం వచ్చిన మద్నూర్ మండలంలో తప్పని గాడిదల సవారి

నవతెలంగాణ- మద్నూర్:

స్వతంత్ర భారతదేశ నికి చాటి చెప్పే విధంగా కంప్యూటర్ యుగం చందమామ వద్దకు రాకెట్ల ప్రయోగం 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది కానీ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల మద్నూర్ మండలంలో ఇప్పటికీ గాడిదల సవారి తప్పనిసరిగా కొనసాగుతుంది ఎందుకంటే వ్యవసాయ శివారు ప్రాంతానికి అసలైన దారులు లేక ఎడ్లబండ్లు గాని ఇతర వాహనాలు గాని శివారు ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి కొన్ని పల్లెటూరు గ్రామాల ప్రజలు పండించిన వ్యవసాయ పంటలను శివారు ప్రాంతం నుండి గ్రామాల్లోకి పంట తీసుకురావడానికి గాడిద సవారీలు ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటాయి కానీ శివారి ప్రాంతానికి వెళ్లే రహదారులు బాగు చేయకపోవడం వ్యవసాయ రైతులు పడే కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పంట సాగు సమయంలో గానీ పంట దిగుబడి వచ్చే సమయంలో గానీ ఎరువులు తీసుకు వెళ్లడానికి పండించిన పంటలు ఇంటికి రాబట్టడానికి గాడిదలకు ఆశ్రయించక తప్పడం లేదు ఎందుకంటే శివారు ప్రాంతంలోకి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఎడ్లబండ్ల రహదారులు సరిగ్గా లేని పరిస్థితి గేట్ల నుండి గాడిదల పైన సవారి తప్పనిసరిగా మారింది. ఈ మారుమూల మండలంలో గాడిదలు సవారి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరంగా మారింది ఎందుకంటే శివారు ప్రాంతానికి ఏది తీసుకువెళ్లాలన్నా శివారు ప్రాంతం నుండి ఏ పంట ఇంటికి రావాలన్నా గాడిద సవారి ముఖ్యంగా మారింది మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో గాడిదల సవారి అధికంగా కొనసాగుతుంది.
Spread the love