అధైర్య పడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఓడి పోయాం అనో, అధికారులు సహకరించడం లేదనో నాయకులు,కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దు అని, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదాం అని ఆయన  అన్నారు.
శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డీ.కే.ఎం మహిపాల్ స్థానిక నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలన్నారు. అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, అండగా ఉంటానని అన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణింద్ర, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్ రావు, కోటగిరి సీతారామస్వామి, జే.కే.వీ రమణారావు, బిర్రం వెంకటేశ్వరరావు, సీహెచ్ వెంకటనరసింహం, శీమకుర్తి వెంకటేశ్వరరావు, సంక ప్రసాద్, తాడేపల్లి రవి పాల్గొన్నారు.
Spread the love