పచ్చి మోసగాళ్ళను నమ్మోద్దు..

– వచ్చే ఎన్నికలు డిచ్ పల్లి మున్సిపాల్టీ లోనే..

నవతెలంగాణ-డిచ్ పల్లి : బిజెపి, కాంగ్రెస్ పార్టీ లో మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, అదికారంలో ఉన్నప్పుడు ఏలాంటి నీదులు ఇవ్వలేని వారు నేడు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని,వారుపచ్చి మోసగాళ్ళని, వచ్చే ఎన్నికలు డిచ్ పల్లి మున్సిపాల్టీ లోనే జరుగుతుందని,డిచ్ పల్లి మున్సిపాల్టీ  ఖచ్చితంగా చేసి తిరుతనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.సోమవారం 12గంటల లోపే మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు, డిగ్రీ కళాశాల ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంను ఏర్పాటు చేశామని దీంతో డయాలసిస్ తో బాదపడుతు జిల్లా కేంద్రం, పట్టణాలకు వేళ్ళవల్సిన అవసరం లేకుండా పోయిందని పేర్కొన్నారు.గతంలో ఎమ్మెల్యే లుగా చేసిన వారు సింగల్ పైసా ఇవ్వని వారు నేడు డబుల్ ఇస్తామని చెప్పి ప్రజల ముందు వస్తున్నారని వారి మాయ మాటలు నమ్మోద్దని సూచించారు.డిచ్ పల్లి మున్సిపాల్టీ చేస్తే దానిలో నడ్పల్లి, ఘన్పూర్, స్టేషన్, గిరిజన తండా లను కల్పి మున్సిపాల్టీ చేస్తామని దీంతో వేగంగా అబివృద్ధి  చేసుకోవచ్చని వివరించారు. బిఅర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ కు న్యాయం చేస్తానని, అదికారంలోకి వచ్చిన వెంటనే ఓక మంచి పదవి ఇచ్చే విధంగా చూస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రజల కోసం ఐదేళ్ల పాటు పని చేస్తున్నానని, నీకోసం 2రేండు నేలలు కష్టపడలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓకోక్క గ్రామానికి కోట్లా రూపాయలు మంజూరు చేసి అబివృద్ధి చేశానని,కోందరు మాయ మాటలు చెప్పే వారు మీ వద్ద కు వస్తారని,కళ్ళబోల్లి మాటలు నమ్మోద్దని పేర్కొన్నారు. ముడవ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారని ఈ సారి గెలుస్తే రాష్ట్రం లో పెద్ద పోస్టు మంత్రి వచ్చే అవకాశం ఉందని బిఅర్ఎస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ప్రజలకు విన్నవించారు. అంతకు ముందు పలు కుల సంఘాల కామ్యునిటి భవనాల నిర్మాణానికి నీదుల మంజూరు పత్రాలను అందజేశారు.
మండల బంజారా సేవ సంఘం భవన నిర్మాణానికి 20లక్షల రూపాయలు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు. గిరిజనుల
అబివృద్ధి కి ప్రత్యేక కృషి చేస్తానని, జిల్లా బంజారా భవన్ నిర్మాణం కు ఎమ్మెల్యే నీదుల నుండీ 1కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు.అనంతరం గిరిజనులు, ఘన్పూర్ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు ఘనం గా స్వాగతం పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, సహకార సొసైటీ చైర్మన్ గజవడ జైపాల్, తరచంద్ నాయక్, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చితం శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి కోర్చి సవిత రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, మండల బంజార సేవ సంఘం అధ్యక్షులు బాల్ రాం నాయక్, జగదీష్, సర్దార్, మోహన్ నాయక్,
 మోహమ్మద్ యూసుఫ్, ఎంపిటిసి సాయిలు, నల్లవెల్లి సాయిలు,తో పాటు తదితరులు పాల్గొన్నారు
Spread the love