అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు: సీఐ సదన్ కుమార్

– శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు
– అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న యువత 
– ఆపరేషన్ చబుత్రా..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక పనులకు యువత పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రూరల్ సీఐ సదన్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహోజేన్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఆపరేషన్ చెబుత్రా పోలీసులు నిర్వహించారు.అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, రోడ్లపై మద్యం సేవించి,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా’ పేరుతో జిల్లా వ్యాప్తంగా  పోలీసులు ముమ్మర త‌నిఖీలు చేపట్టినట్లు తెలిపారు.యవకులు అర్ధరాత్రి వేళల్లో  ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో  వాహనాలను నిలిపి గుంపులుగా అనుమానస్పదంగా  తిరుగుతున్న జిల్లావ్యాప్తంగా 256 మంది యువకులను అదుపులోకి తీసుకోని,81 ద్విచక్ర వాహనాలను  సీజ్ చేసి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు  తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.అంతేకాకుండా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా ఆపరేషన్ చబుత్రా  స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.  అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా  సంచరిస్తూ..సామాన్య  ప్రజానీకానికి, మహిళల ను ఇబ్బందుల కు, అభద్రత భావానికి గురి చేస్తే   వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు  చేస్తామన్నా రు.యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి మంచి భవిష్యత్ ను కోల్పోతారు అని సూచించారు.

Spread the love