ప్రలోభాలకు గురికావద్దు.. స్వేచ్ఛగా ఓటుహక్కు వాడుకోవాలి

 – కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ- మల్హర్ రావు: ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని స్వేచ్ఛగా ఓటుహక్కు వాడుకోవాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి కోరారు. ఈ నెల న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ప్రజలకు కొయ్యుర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలపై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని, ఎలాంటి గొడవలు చేయకుండా శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఏదైనా గొడవలు జరిగినట్లయితే పోలీసులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటారం కాటారం సిఐ రంజిత్ రావు కొయ్యూరు ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love