చిరుమర్తి గెలుపుకై ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – నకిరేకల్
నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని కోరుతూ ఆదివారం మండలంలోని నోముల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో చిరుమర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోముల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love