– మానుకోట ఎంపీ అభ్యర్థి డాక్టర్ మహిపతి అరుణ్ కుమార్
నవతెలంగాణ – తాడ్వాయి
ఇలవేల్పు కారుకొండ సడలమ్మ వనదేవత దీవెనలతో శనివారం మానుకోట ఎంపీ అభ్యర్థి డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ దర్శించుకుని ఆయన సొంత మండలంలో సడలమ్మ ఆలయం ప్రాంగణం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. తల పతులు, అర్తిబిడ్డ లు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మానుకోట తుడుం దెబ్బ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ దళిత బహుజన సామాజిక కులాలు ఈ ఎంపీ ఎన్నికల్లో ఆదివాసీలకు అండగా నిలపడలని కోరారు. లంబాడీల వలన మా ఆదివాసీల బతుకులు రిజర్వేషన్ లు విద్య ఉద్యోగ అవకాశాలు కొల్ల గొట్ట బడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ యుద్ధం లో మా ఓట్లకు మిగతా సామాజిక కులాల ఓట్లు కనుక కలిస్తే ఎంపీ గా గెలిచి లంబాడీల ను ఎస్టీ లో నుండి తొలగించి మా జాతి నీ రక్షించుకుంటాము అని అరుణ్ తెలిపారు. ఈ కార్య క్రమం లో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోరగట్ల లక్మన్ రావు, ఉపాధ్యక్షులు పాయం, కోటేశ్వరరావు, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, ప్రచార కార్యదర్శి ఈర్ప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.