డాక్టర్ మధు శేఖర్ కు అంసా ఆధ్వర్యంలో ఘన సత్కారం..

నవతెలంగాణ -జక్రాన్ పల్లి 
ఆర్మూర్ పట్టణంలోని ఎంజె హాస్పిటల్ లో ఇటీవల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ రాష్ట్ర తొలి చైర్మన్ గా నియమించబడిన ఎం జె హాస్పిటల్ అధినేత, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు,పేదల డాక్టర్  శ్రీ బద్దం మధుశేఖర్ ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్, సీసీ బ్యాంక్ డైరెక్టర్ గోరికంటి లింగన్న, ధని సాయన్న, అడ్డికే గంగాధర్, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా యూత్  విభాగం అధ్యక్షులు కిరణ్ అనుపాల్, సీనియర్ దళిత నాయకులు సామ్రాట్ అశోక్, అంగుళి మాల,గోలి సురేందర్, నాగరాజులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ డాక్టర్ మధుశేఖర్  అంటరాని గుడిసె నుండి అఖిల భారత స్థాయి లో గొప్ప పేరును సంపాదించుకున్న సర్జన్ అని ఆర్మూర్ డివిజన్ లో చేయూత స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేసి ఉచితంగా పేదప్రజాలకు సర్జరీలు, మందులు అందించి ఆరోగ్యదాత గా నిలిచారన్నారు,చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల పాలిట విద్య దాతగా ఏంతో మందికి తోడ్పాటు అందించారని,అటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, ఇటు సామాజిక ఉద్యమాల్లో డాక్టర్ మధుశేఖర్ పాత్ర మారువరనిదని ,వారు అందించిన సేవలకు,వైద్య రంగంలో ఆయనకున్న అపార అనుభవనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ తొలి చైర్మన్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఇలాగే నిరంతరం ప్రజా సేవలో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love