నర్సరీలలో ముమ్మరంగా మొక్కలను పెంచాలి : డిఆర్‌డిఓ పీడీ

నవతెలంగాణ – బోనకల్‌
గ్రామపంచాయతీలలో గల నర్సరీలలో అవసరమైన మొక్కలను విస్తృతంగా పెంచాలని డిఆర్‌డిఓ పిడి మెరుగు విద్యాచందన మండల అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని స్వచ్ఛ సర్వేక్షణ్‌ అభియాన్‌ ప్రచారంలో భాగంగా ముష్టికుంట్ల, చిరునోముల గ్రామ పంచాయతీలలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వ్యక్తిగత సోక్‌ పిట్‌లకు మార్క్‌ అవుట్‌ మండల అధికారులు ఇచ్చారు. అదే విధంగా చిరునోముల గ్రామ పంచాయతీలోని నర్సరీలు, బహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచాలని ఆమె సూచించారు. గ్రామ పంచా యతీలో ఆ గ్రామానికి అవసరమయ్యే మొక్కలను మాత్రమే పూర్తిస్థాయిలో పెంచాలని, ఇతర గ్రామ పంచాయతీల నుంచి మరొక గ్రామానికి మొక్కలను తీసుకువచ్చే విధానాన్ని విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని గ్రామాలలో అవసరమైన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆమె అధికారులను కోరారు. కార్యక్రమానికి ఏపీడీ చుంచు శ్రీనివాస్‌, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్‌, ఏపీఓ బసవోజు కృష్ణకుమారి, ఈసీ పిల్లుట్ల కిరణ్‌కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పరిస కృష్ణవేణి, షేక్‌ మున్ని, టీఏలు మాతంగి సురేష్‌, సర్పంచ్‌లు ములకారపు రవి, షేక్‌ బిజాన్‌ బి తదితరులు పాల్గొన్నారు.

Spread the love