Friday, May 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలివేంద్రం

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలివేంద్రం

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య జయంతి సందర్భంగా మే డే స్ఫూర్తితో.. స్థానిక నాందేవ్ వాడలో చలివేంద్రం మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. సుందరయ్యప్రారంభించారు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యారంగానికి నిధులను కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సుందరయ్య స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటాలను రూపొందించి ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. అదే విధంగా విద్యార్థులకు ప్రజలకు తెలియజేసేది ఏమనగా ఎండల తీవ్రతతో వడ దెబ్బలు తాకుతున్నాయి. కావున ఎండలలో తిరగకూడదు అని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన నీటిని త్రాగి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా సహాయ కార్యదర్శి కారం చక్రి, జిల్లా నాయకులు గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -