Sunday, May 3, 2026
E-PAPER
Homeకరీంనగర్అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్ పర్సన్

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్ పర్సన్

- Advertisement -

న‌వతెలంగాణ‌-రాజ‌న్నసిరిసిల్ల‌: మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పాల్గొని మాట్లాడారు. నేడు ప్రపంచంలో పొద్దు పొడిచిన నుండి రోజు ముగిసే వరకు ఎన్నో రంగాలలో నేటి ఆధునిక ప్రపంచ లో మనిషి జీవనం సాఫీగా సాగే క్రమంలో, సమాజ అభివృద్ధిలో కార్మికుల శ్రమ దాగి ఉందని అన్నారు. శ్రమ నీ పెట్టుబడిగా పెట్టి పని చేసే ప్రతి కార్మికుడిని ప్రతి ఒక్కరు గౌరవించాలని వారు పని చేయకుంటే సమాజం స్తంభించబోతుందని అన్నారు..

ముఖ్యంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారి ఆరోగ్యాలను సైతం పనంగా పెట్టి సమాజం కోసం ముందు వరుసలో ఉండి పోరాడే శ్రమజీవులు వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు.. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్స్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముసం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ లు,బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పోరండ్ల రమేష్, మున్సిపల్ పారిశుధ్య కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్, పారిశుధ్య కార్మికులు, భవన నిర్మాణారంగ కార్మికులు పవర్ లూమ్ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -