నలుగురు నిందితులు అరెస్ట్..
మరో నలుగురు పరారీ
నవతెలంగాణ-బీబీ నగర్
రూ.54 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన ఆదివారం యాదాద్రి- భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామశివారులో చోటుచేసుకుంది. సంఘటన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకాంక్ష్‌యాదవ్ వెల్లడించారు. జిల్లాలో మాదకద్రవ్యాలు అక్రమ తయారీ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు చేపడుతున్న ప్రత్యేక చర్యలో భాగంగా బీబీనగర్ పోలీసులు, ఎస్‌ఓటీ భువనగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.54 కోట్ల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా పాల్పడుతున్న నలుగురు నిందితులు చేతన్ మధుకర్ మెట్రామ్, ముజామల్‌హక్, ఆకాశ్ అశోక్ గవాండే, రమణమూర్తిని అరెస్టు చేశారు. ఎండీ అయూబ్ అలీ, చందప్రదీప్ ఠాకూర్, గోపాల్ పటేలియా, ఏటకూరి రామరాజు పరారీలో ఉన్నారు. సుమారు 27 కిలోల మెపోడ్రోన్ డ్రగ్‌తోపాటు డ్రగ్ తయారీకి ఉపయోగించే 40 కిలోల లిక్విడ్‌ను ఎంహెచ్ 49 సీడబ్ల్యూ 1313 నెంబర్ గల ఫార్చునర్ కారును వీటితోపాటు సీజ్ చేశారు. కొండమడుగు గ్రామ శివారులోని వేటుకూరి ల్యాబ్స్‌లో అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్‌ను నాగపూర్ తరలించి అక్కడ పంపిణీ చేశారు. వేటకూరి ల్యాబ్స్‌లో తనిఖీ చేసి డ్రగ్ తయారీకి ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ను ఎస్డీపీఓ యాదాద్రి భువనగిరి డివిజన్ ఇన్‌చార్జి బి. శ్రీనివాస్ నాయుడు పర్యవేక్షించారు.ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి. ప్రవీణ్ బాబు, బీబీనగర్ ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు రమేష్, కృష్ణయ్య పాల్గొన్నారు.
రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



