నూతన సంవత్సర వేడుకలు.. భారీగా నమోదు అయిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు..

నవతెలంగాణ హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసుల నమోదు చేశారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Spread the love