అకాల వర్షానికి అతలాకుతలం..

– ఈదురు గాలులకు ఉద్యాన పంటల నష్టం
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ అచ్చంపేట : అకాల వర్షానికి ఈదురు గాలులకు నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లో రేకుల షెడ్లు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు , ఉద్యాన పంటలు నేలకూలాయి.అతలాకుతలం.. అయ్యింది. విదిగిన విద్యుత్ స్తంభాలను, వృక్షాలను సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో నిన్న సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం వలన గ్రామంలో భారీ వృక్షాలు విరిగిపడడం జరిగింది, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. ఆగ్రామంలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించి ప్రజలకు భరోసా ఉంటూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జరిగిన నష్టం నివారణ చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, విరిగిపడిన చెట్లను తొలగించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాయచోడి గ్రామంలో 2000 బొప్పాయి చెట్లు విరిగిపోయాయి అకాల వర్షాల దాటికి అచ్చంపేట, ఉప్పునూoతల , చుట్టుపక్కల పరిసరాల గ్రామాల్లో చాలా ఇంటి పైకప్పులు ధ్వంసం అయ్యాయి. అకాల వర్షాలు దాటిని ఏటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే సూచించారు.

Spread the love