– ఆ యూనియన్ మహాసభలో 13 తీర్మానాలకు ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(ఎస్సీకేఎస్-సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులుగా దూలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బి.మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం బి.మధు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ యూనియన్ రాష్ట్ర ఆరో మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జులై 29 నుంచి 31 వరకు జరిగాయని పేర్కొన్నారు. ఆ మహాసభలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, వేతనాల పెంపు, కార్మిక చట్టాలు-వేతన ఒప్పందాల అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వైద్యం, తదితర అంశాలపై ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని తీర్మానం చేశామని తెలిపారు. మహాసభలో మొత్తం 13 తీర్మానాలు చేశామని పేర్కొన్నారు.
ఎస్సీకేఎస్ నూతన కమిటీ ఇదే..
గౌరవాధ్యక్షులు : మందా నర్సింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : బి.మధు రాష్ట్ర అధ్యక్షులు : దూలం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు : జి.మహెందర్, ఎ.ఓదేలు, ఉపెందర్, సిహె.చ్ లక్షినారాయణ , కె.రాజయ్య , కార్యదర్శులు : సిహెచ్.అరవింద్, గద్దల శ్రీనివాస్,వి.కుమారస్వామి, సారయ్య, వి.కుమారి,కోశాధికారి : సూరం ఐలయ్య