బీజేపీలో చేరిన దూపల్లి సర్పంచి శనిగరం సాయి రెడ్డి

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం ధూపలి సర్పంచ్ శనిగారం సాయి రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ప్రజా సమస్యలను నెరవేర్చాలంటే బీజేపీకి సాధ్యమని వడ్డీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో పుణ్య స్థానాలను ఆచరించిన అనంతరం జూపల్లి సర్పంచ్ శనిగరం సాయి రెడ్డికి బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Spread the love