
మండలంలోని స్వయం సహాయక బృందాలు, ఐకెపి సిబ్బంది ప్రతి ఒక్క సంఘ సభ్యురాలికి వారి ద్వారా ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై సంపూర్ణ అవగాహన కల్పించాలని తహసీల్దార్ ఆంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, మెహేంది పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళా సమాఖ్య ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచిస్తూ రంగురంగుల రంగవల్లులను వేశారు. ప్రతి ఒక్క ఓటరు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీడీవో పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కుంట గంగాధర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రోజా రాణి, సీసీలు రవికుమార్, శ్రీనివాస్, నవీన్, భాగ్యలక్ష్మి, పీరియ, అలేఖ్య, మహిళలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.