ఆర్వో సీల్ లేని పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టత ఇచ్చిన ఈసీ

నవతెలంగాణ – హైదరాబాద్: రిటర్నింగ్ అధికారి సీల్ (ముద్ర) లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆర్వో సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ నిర్దేశించింది. ఆర్వో సీల్ లేకపోయినా… ఆర్వో సంతకం ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే, ఫారం-13ఏలో అన్ని వివరాలతో పాటు ఆర్వో సంతకం కూడా ఉండాలి… అప్పుడే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఒకవేళ ఫారం-13ఏలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చు అని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Spread the love