నవతెలంగాణ-వర్ధన్నపేటతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి పోశయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో బలోపేతం చేసుకోవాలని, పూర్వ విద్యార్థులు, ఒక వ్యక్తి ఐదుగురు చొప్పున డిగ్రీ కళాశాలలో చేరే విధంగా కృషి చేయడంతో పాటు అభివృద్ధి పరచుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షిభారాణి రాజేందర్, కౌన్సిలర్ లు ఎం దేవేందర్, పాపారావు, శ్రీ వాణి కుమారస్వామి, రైతు వేదిక సభ్యులు రామ్ రెడ్డి , రజిత సమన్వయకర్త డాక్టర్ బి విష్ణుకుమార్, విద్య వారోత్సవాల సమన్వయకర్త ఐ.క్యు.ఏ.సి కోఆర్డినేటర్ డాక్టర్ రజిత, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రాజు, డాక్టర్ ఏ మధుసూదన్ రెడ్డి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ డాక్టర్ సిహెచ్ స్నేహలతారెడ్డి డాక్టర్ వి సంపత్ రెడ్డి డాక్టర్ బి శ్వేత డాక్టర్ శ్రీమతి కె జోష్ణ తోపాటు నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



