
మండలంలోని కొనసముందర్ గ్రామంలో శనివారం శాలి వాహన కుమ్మరి సంఘం అధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహా స్వామి అష్టమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, స్వామి వారి అభిషేకం, అలంకరణ, స్వస్తి పుణ్యవచనం, గణపతి పూజ, గౌరీ పూజ, హోమం, స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛర్ణాల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం కుంకుమార్చన పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షులు పోతుగంటి లింగయ్య, ఉపాధ్యక్షులు పోతుగంటి శ్రీనివాస్, కానూరు మోహన్, పోతుగంటి భాస్కర్, బలరాం, కృష్ణ, చిన్న గంగాధర్, అర్చకులు సుధాకర్ శర్మ, అనుదీప్ శర్మ, సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.