కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నికల ప్రచారంలో కలిసిన పెద్ద తడగూర్ బుడ్డోడు

నవతెలంగాణ- మద్నూర్

రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటా లక్ష్మి కాంతారావు గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బిచ్కుంద ఎన్నికల ప్రచార సభకు హాజరైన సందర్భంగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజు కుమారుడు ఎలిప్యాడ్ వద్ద రేవంత్ రెడ్డిని కలిశారు కాబోయే ముఖ్యమంత్రిని ఆ బుడ్డోడు కలవడం మండల ప్రజలు అభినందిస్తున్నారు. నా కుమారునికి దగ్గర తీసుకొని పలకరించిన రేవంత్ రెడ్డికి బుడ్డోడి తండ్రి రాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం నా కుమారుడు ఆయనను కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
Spread the love