మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం..

నవతెలంగాణ – మంథని
మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంథని మండలం నాగారం,కన్నాల,విలోచవరం గ్రామాలలో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టి అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.అనంతరం ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి కూలీలతో ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పథకాలను ఓటర్లకు క్లుప్తంగా వివరించారు.ప్రచార కార్యక్రమంలో ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసిస్సులతో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండలనాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు ఓటర్లను కోరారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పని దినాలు 200 రోజులతో పాటు ప్రతి ఒక్క ఉపాధి కూలికి రూ.400 లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెలిపియాలను ఇంటి ఇంటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ కులాలతో మాట్లాడి నాయకులు ఓట్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలోప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,నాగారం,కన్నాల,విలోచవరం సీనియర్ నాయకులతోపాటు యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Spread the love