
ధర్మ సమాజ్ పార్టీ నూతన మండలాధ్యక్షుడిగా మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన మహంకాళి సురేశ్ ఎన్నికైనట్టు జిల్లాధ్యక్షుడు బోయిని సదన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన డీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన మండలాధ్యక్షుడి ఎన్నిక నిర్వహించామని సదన్ కుమార్ తెలిపారు.