ఎస్ఎఫ్ఐ న్యాయ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ గా రాచకొండ విగ్నేష్ ఎన్నిక

– రాష్ట్రంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి 15 వేల స్టైఫండ్ ప్రభుత్వం అందించాలి: లా సబ్ కమిటీ డిమాండ్
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, లా సబ్ కమిటీ డిమాండ్ చేశారు.రాష్ట్ర న్యాయ విద్యార్థుల  కన్వెన్షన్ హైదరాబాదులోని ముషీరాబాద్ కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ  పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ న్యాయ విద్యార్థుల (లా) రాష్ట్ర కన్వీనర్ గా తెలంగాణ యూనివర్సిటీ కి చెందిన లా ఫైనల్ ఇయర్ విద్యార్థి రాచకొండ విగ్నేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్యార్థుల సమస్యలపై భవిష్యత్తులో పోరాటాలకు కర్తవ్యాలను రూపొందించామని అదేవిధంగా 11 తీర్మానాలను ఆమోదించినట్లుగా తెలిపారు. అదేవిధంగా కేరళ, కర్ణాటక తరహాలో లా విద్యార్థులకు 15000 స్టైల్ ఫండ్ రెండేళ్ల పాటు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేక పోవడం, మూట్ కోర్టు లను ప్రతి కళాశాలలో ఏర్పాటు చేయాలని అన్నారు. నాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి లా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయ కళాశాలలు సందర్శించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తు కాలంలో అందజేస్తామని న్యాయ విద్యార్థుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేటట్టుగా కృషి చేయాలని అన్నారు.
Spread the love