వర్సిటీ గిరిజన శక్తి నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూని వర్సిటీ గిరిజన శక్తి నూతన కమిటీ ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా ఎన్. శ్రీను రాథోడ్, వైస్ ప్రెసిజెంట్ గా కె. సంజయ్ భట్టు, సెక్రెటరీగా సంతోష్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్రా అధ్యక్షులు కోర్ర శరత్ నాయక్  నాయకత్వంలో నూతన కమిటీ ని ఏర్పాటు కోసం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యునివర్సి గిరిజన శక్తి అధ్యక్షుడు ఎన్.శ్రీను రాథోడ్ మాట్లాడుతూ యూని వర్సిటీలో నెలకొని ఉన్న సమస్యల పై నిరంతరం పారాటం చేయటానికి సిద్ధంగా ఉన్నామని, అదికారులు సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు శివ నాయక్,శ్రీ కాంత్ నాయక్, హరి నాయక్, ప్రకాష్ నాయక్, ఆకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love