
– నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సమావేశమైన జిల్లా కలెక్టర్ తో కలసి పాల్గొన్న సాధారణ పరిశీలకులు
– సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్యవంశీ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికలు సమన్వయం, సమిష్టి కృషితో పారదర్శకంగా నిర్వహించాలని 13-నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశీ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి లోబడి నిర్వహణ ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్లు , సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని అలాగే మైక్రో అబ్జర్వర్లు తమ చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా పరిశీలన చేయాలని సూచించారు. అదేవిదంగా నిరంతరం వెబ్ క్యాస్టింగ్ పరిశీలన చేయాలని , ఓటర్ పోలింగ్ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డులు చూపి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో సమస్యలు ఉత్పన్నమైతే నా సెల్ నెం. 7337046757 నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు. 229 క్రిటికల్ కేంద్రాల్లో బయట వెబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణ జరగాలని అన్నారు.
అన్ని చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,00012 మంది ఓటర్లు ఉండగా, 728 ప్రాంతాలలో 1201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో భాగంగా నల్గొండ పరిధిలోకి 875 పోలింగ్ కేంద్రాలు అలాగే భువనగిరి పరిధిలోకి 326 పోలింగ్ కేంద్రాల ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో రూ. 273.87 లక్షలు నగదు, రూ. 121.43 లక్షలు రూపాయల విలువ చేసే బంగారం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేయడం జరిగిందన్నారు. అలాగే, పోలీసులు, ఎక్సయిజ్ శాఖల ద్వారా 35373.60 వేల లీటర్ల అక్రమ మద్యం నిల్వలను గుర్తించి సీజ్ చేశారని వాటి విలువ 141.16 లక్షలు ఉంటుందని వివరించారు. ఎఫ్.ఎస్.టీ, ఎస్.ఎస్.టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయని, పట్టుబడిన నగదుకు సంబంధించి ఆధారాలు కలిగి ఉన్న వారికి గ్రీవెన్స్ కమిటీ ద్వారా పరిశీలన జరిపించి నగదును తిరిగి అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఐడిఓసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సి.విజిల్ 54 ఫిర్యాదులు అందగా 48 కేసులు పరిష్కరించామని, సువిదా లో 291 అనుమతులకు గాను 180 అనుమతులు ఇచ్చామని అలాగే 87 తిరస్కరించడం జరిగిందని 20 రద్దు అయ్యాయని మిగిలిన 4 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన కాల్స్ కి 181 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. అలాగే ఎఫ్.ఎస్.టీ, ఎస్.ఎస్.టీ బృందాలు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నామని, వారి వాహనాలకు అధునాతన పీటీజెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. అలాగే సరిహద్దున గల ఆంధ్ర ప్రదేశ్ నుండి మద్యం, ఇతర వస్తువులను జిల్లాకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు ప్రాంతాల్లో 7 చోట్ల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సి.సి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
నియోజకవర్గ కేంద్రాల పార్లమెంటు సెగ్మెంట్ ను 122 రూట్లుగా విభజిస్తూ 123 మంది సెక్టోరల్ అధికారులను నియమించామని అన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలలో 229 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి గట్టి నిఘాతో పాటు పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందిచే ఇంటింటికి తిరుగుతూ ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయిస్తున్నామని తెలిపారు. అదేవిదంగా 85 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 6428 మంది, దివ్యంగ ఓటర్లు 17230 మంది ఉండగా, ముందస్తుగానే వారికి 12-డీ ఫారాలు అందించడం జరిగిందన్నారు. వీరిలో 699 మంది దరఖాస్తులు చేసుకోగా వాటిలో 692 మంది దరఖాస్తులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఈ.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి ఇళ్లకు వెళ్లి గోప్యతను పాటిస్తూ ఓటింగ్ నిర్వహించడం తేదీ.3.5.2024, 4.5.2024 8.5.2024 మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నమని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్, ఎన్నికల కంట్రోల్ రూం, సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్, అలాగే డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సక్షన్ కేంద్రాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లత, ఏఎస్పీ నాగేశ్వర రావు నోడల్ అధికారులు సతీష్ కుమార్, డి.ఏ.ఓ శ్రీధర్ రెడ్డి, అప్పారావు, మధుసూదన్ రాజు మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.