– అందుబాటులో ఉన్న సీట్లు 19,049
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. గురువారం నుంచి ఈనెల 19 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు చేయాలని కోరారు. 23న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 25 నాటికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. లేదంటే కేటాయించిన అభ్యర్థుల సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ఇంకా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర వివరాలకు https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.