అపురూపలో రెండవ రోజు యాగశాల ప్రవేశము 

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో సప్తాహ్నిక పుష్కర బ్రహ్మోత్సవాలు భాగంగా రెండవ రోజు స్వామి వారి యాగశాల ప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఉదయం సభా ప్రార్ధన, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సూర్యకాంత శిలాజాగ్నిప్రతిష్ట, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, శాంతిపాఠం, వేదాది విన్నపములు, మూర్తికుంభ ఆరాధన, చతుస్థానార్చన, (సంతాన ఫలసిద్ధి | కై) వైనతేయ ఇష్టి, పూర్ణాహుతీ, ధ్వజారోహణం, బలిహరణ, నివేదన, నీరాజనం. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, భేరితాడన, దేవతాహ్వానం, (దీర్ఘ సుమంగళిత్వానికై) | సామూహిక లక్ష్మీనారాయణ కుంకుమార్చన, పల్లకిసేవ, హంస వాహనము, యాగశాలార్చనలు, పూర్ణాహుతి, నివేదన, నీరాజనం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, కమిటీ సభ్యులు, అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love