సమానపనికి సమాన వేతనం చెల్లించాలి

– సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ సులోచన
నవతెలంగాణ-జగిత్యాలటౌన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్నీ వీడి యూనియన్లతో చర్చించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ సులోచన డిమాండ్‌ చేశారు. మంగళవారం అంగన్‌వాడీల సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ సులోచన మాట్లాడుతూ.. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వం వెంటనే యూనియన్‌ నాయకులతో చర్చించాలని సమస్యను పరిష్కరించాలని,కనీస వేతనం రూ.26 వేలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్‌వాడీ సమ్మెకు బీఎస్పీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సరిత, స్వప్న, శారద, కళావతి, గంగజమున, జ్యోతి, సౌజన్య, మమత, రజిత, పద్మలతో పాటు టీచర్లు, ఆయాలు ఉన్నారు.

Spread the love