నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని త్రీ లింగ రామేశ్వర ఆలయం ఆవరణలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త దత్తు తెలిపారు. రాఘవ పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కరణం సత్యనారాయణ రెండు లక్షల విలువ చేసే విజ్ఞాన కేంద్రాన్ని త్రీలింగేశ్వర ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసి ఆలయానికి అప్పగించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన అద్భుతమైన త్రీలింగేశ్వర ఆలయానికి ప్రతిరోజు భక్తుల తాకిడి పెరగడంతో ఆలయానికి వచ్చిన భక్తులు గ్రంథ పఠనం, ధ్యానం, సత్సంగం చేయడానికి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించి ఆలయానికి అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వారి వెంట వెంకట్రామిరెడ్డి. శ్యామ్ రావు. చంద్రమోహన్. సుహాన్ రెడ్డి .శంకరయ్య. దుర్గయ్య .సాయిలు తదితరులు పాల్గొన్నారు.