నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన ఏటుకూరి ప్రసాద్(90) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వయో సంబంధిత సమస్యలతో ఆయన మరణించారు. 1970 నుంచి అభ్యుదయ రచయితల సంఘం(అరసం) పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. చివరి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలం అరసం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఎర్రజెండా, ఎర్రబాట, శివాలయ్య లాంటి పేరొందిన రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. తాపీ ధర్మారావుపై పీహెచ్‌డీ చేశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు (ఆదివారం) జరుగుతాయని సన్నిహితులు తెలిపారు.
తెలంగాణ సాహితి నివాళి
అభ్యుదయ రచయిత, విమర్శలు ఏటుకూరి ప్రసాద్ మరణం సాహిత్య లోకానికి తీరని లోటని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లాభాపురం జనార్దన, కె. ఆనందాచారి అన్నారు. అరసం పునః నిర్మాణంలో ఏటుకూరి ప్రసాద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
విశాలాంధ్ర సంపాదకులుగా ఆయన విశేష సేవలందించారని గుర్తుచేశారు.
ఏటుకూరి ప్రసాద్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -



