ఈ సారైనా… వందశాతం పోలింగ్ అయ్యేనా?

నవతెలంగాణ- మల్హర్ రావు: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ప్రతి ఓటరు ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ మంథని నియోజకవర్గ అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతో నియోజకవర్గంలో వందశాతం పోలింగ్ అయ్యేనా అనే సందేహాలు పలువురు వెలిబుచ్చుతున్నారు. ఈ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. ఆన్ లైన్ యాప్ ల ద్వారా ప్రచారం కల్పించడంతోపాటు కళాబృందాల ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంథని నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈవిఎం, వివిప్యాట్ ల పనితీరును వివరించారు. బూత్ లెవల్ అధికారులు సహా మండల, జిల్లాస్థాయి అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
2018లో మంథనిలో 85.14శాతం
మంథని నియోజకవర్గంలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంథని అసెంబ్లీ స్థానంలో 2014లో 81 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, 2018లో 85.14 శాతం నమోదు అయింది. అయితే ఈ సారి ఎన్నికల్లో వందశాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.
ఈ సారి అభ్యర్థి ఫొటో కూడా…
ఓటరు ఓటు వేసేందుకు వెళ్ళగానే ఈవిఎం మిషన్ పై లైట్ వెలుగుతొంది. ఓటరు తాను ఎంచుకున్న గుర్తుపై నొక్కాలి. ప్రక్కనే ఉన్న వివిఫ్యాట్ పై చూడాలి అందులో తను వేసిన గుర్తు కనిపిస్తోంది. తరువాత బీఫ్ మని శబ్దం వచ్చి ఆ గుర్తు కనిపించదు. ఈ సారి ఎన్నికల్లో గుర్తుతోపాటు అభ్యర్థి ఫొటో కూడా ఓటర్లకు కనిపించేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న…
నేను ప్రతి ఎన్నికల్లో తప్పని సరిగా ఓటు వేస్తున్న, సొసైటీ ఎన్నికల్లోను పాల్గొంటా ఈ సారి కూడా ఓటు వేస్తాను. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత.
తొలిసారిగా ఓటు వేయబోతున్న
నేను తొలిసారిగా ఓటు వేయబోతున్న. ఎన్నికల అధికారులు ఓటు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. ప్రచార వాహనాలు ఊరూరా తిప్పుతున్నారు.
Spread the love