Tuesday, September 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినిత్యచలనశీలి

నిత్యచలనశీలి

- Advertisement -

​నిత్యం నిజాల నిప్పుల్ని మింగి
మాటలతో మంటలు పుట్టించి
నిర్లిప్త జనావళి జాగృతికై
చైతన్యపుదారుల్లో అక్షరాలనే
ఆయుధాలుగా కవాతు చేయించిన అక్షరశిల్పి
​నిజాయితే ఊపిరిగా…
నిబద్ధతే ఆయుధంగా…
చివరి శ్వాసవరకు
ఒకే శ్వాసకోశంతో
పీడిత జనావళి కోసం
కాలాన్ని కలంలో నింపి
కరవాలంగా దూసిన
కవనయోధుడు
​తెలంగాణా విముక్తే ధ్యేయంగా
స్వరాన్ని భాస్వరంగా మండించిన
ధిక్కార ఉద్యమకెరటం
​వలసపాలకుల చెరనుంచి
కన్న భూమి సంకెళ్లను తెంచేందుకు
తెగదెంపుల పోరాటం చేసిన చలనశీలి
​పేరులో మూడక్షరాలున్న
విశాల భావాల విశ్వమానవుడై
పౌరహక్కుల నేతగా
త్యాగమే ఊపిరిగా బతికిన
నిస్వార్ధ ప్రజాసేవకుడు
​ప్రజలందరి గొడవను
నా గొడవంటూ
కవిత్వమై నినదిస్తూ..
ఒక్క సిరాచుక్కతో
లక్ష మెదళ్లను కదిలించిన
ప్రజాకవి
​జీవితాన్నే కాదు
నిలువెత్తు దేహాన్ని
త్యాగం చేసిన
నిజమైన త్యాగధనుడు
​- ప్రొ. బాణాల శ్రీనివాసరావు,
9440471423

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -