ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి..

నవతెలంగాణ – కంటేశ్వర్
హెచ్ఐవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం హెచ్ఐవి నివారించగలం అని జిల్లా సీనియర్ జడ్జ్ సెక్రెటరీ లీగల్ సర్వీస్ అథారిటీ పద్మావతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినం 2023 పురస్కరించుకొని ప్రభుత్వ గిర్ రాజ్ కళాశాల ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం నకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సీనియర్ జడ్జి  సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ పద్మావతి  మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్ఐవి తగ్గు ముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం హెచ్ఐవి నీ నివారించ కలుగుతాము అని అన్నారు. దీని కొరకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. అలాగే హెచ్ఐవి సోకిన వారి పట్ల వివక్ష లేకుండా ఉండాలి అని వారి హక్కులు భంగం కలగకూడదని అని అన్నారు. అలాగే మా వంతు కృషిగా ఈ సంవత్సరం ట్రాన్స్ జెండర్స్ ఇద్దరి కి , సెక్స్ వర్కర్స్ కు ఉద్యోగాలు అలాగే లేబర్ కార్డ్స్ ఇప్పించడం జరిగిందని తెలియజేశారు. అ లాగే జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం. సుదర్శనం మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో 5.4 % శాతం నుండి 0.39 వరకు తగ్గించగలిగామని అలాగే తల్లి నుంచి బిడ్డకు రాకుండా కాపాడగలుగుతున్నామని అలాగే ముందు ముందు జీరో హెచ్ ఐ వి దిశగా జిల్లా ను చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు. అలాగే ప్రపంచ ఎయిడ్స్ దినం లో భాగంగా కళాశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, పోస్టర్ మేకింగ్, రంగోలి కార్యక్రమాలు నిర్వహించి జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో ఏసీపి కిరణ్ కుమార్, జిజిహెచ్ సూపర్డెంట్ ప్రతిమ రాజ్, డి డబ్ల్యు ఓ రసూల్ భి గారు,జైలరు రాజశేఖర్ రెడ్డి, ఎన్వైకేే కోఆర్డినేటర్ శైలి బెళ్ళల్, దివ్య డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రామ్మోహన్, అంతుల్ , డాక్టర్. అనుపమ , స్నేహ సొసైటీ పిడి సిద్ధయ్య,గారు, డి పి ఎ సుధాకర్, జిల్లా టిబి,  హె చ్ ఐ వి కోఆర్డినేటర్ రవిగౌడ్,అలాగే నిజాం అభయ , వర్డ్, చైల్డ్ ఫండ్ ఇండియా , సూర్య ఆరోగ్య సంస్థ, సాథి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
Spread the love