సివిజిల్ ఆప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

– ఓటరు జాబితాలో డూప్లికేట్ మరణించిన వారి వివరాలపై ఆరా తీసిన కలెక్టర్ ..
– ఎన్నికల ఉల్లంఘన పై  ఫోటో,వీడియో ద్వారా పిర్యాదు చేస్తే 100 నిమిషాలలో పరిష్కారం అవుతుంది..
– జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్..
నవతెలంగాణ – మునుగోడు
సి విజిల్ ఆప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.బుధవారం మునుగోడ్  తహశీల్దార్ కార్యాలయం ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక గా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.విజిల్ యాప్ పై అవగాహన కలిగించాలని , అందుకు సంబంధించిన ప్లెక్సీ కార్యాలయం ముందు ఏర్పాటు చేయాలని అన్నారు. బి.ఎల్. ఓ లతో మాట్లాడుతూ సి.విజిల్ ఆప్ గురించి అడిగారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, డబ్బు, మద్యం పంపిణీ, వస్తువులు పంపిణీ పై ఫోటో, వీడియో ద్వారా పిర్యాదు చేస్తే 100 నిమిషాలలో లో పరిష్కరించటం జరుగుతుందని అన్నారు. ఓటర్ జాబితా లో డుప్లికేట్ లు,మరణించిన వారి తొలగింపు చేశారా అడిగి తెలుసుకున్నారు. పి. డబ్ల్యూ.డి ఓటర్ లు మార్కింగ్ చేయాలని అన్నారు.80 సం. లు దాటిన వారు, ఇంటి నుండి కదల లేని స్థితి వారు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.వారికి సంబంధిత దర ఖాస్తు అందగా చేసి కలెక్ట్ చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట అర్.డి. ఓ దామోదర రావు, తహశీల్దార్ ఉన్నారు.
Spread the love