– సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేయ గౌడ్
నవతెలంగాణ- జక్రాన్ పల్లి : ఓటు హక్కు అందరి వినియోగించుకోవాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేగౌడ్ సోమవారం అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వేళ ప్రజలను చైతన్య పరచాలనె కార్యక్రమం నిజాంబాద్ పట్టణంలోని వినాయక నగర్ లో ని నారాయణ ఇంటి ఆవరణలో కార్యవర్గ సమావేశంలో ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని అంశంపై దత్తాత్రే గౌడు మాట్లాడారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ ఛైర్మెన్ డా. గంప హనుమ గౌడ్, తెలంగాణా రాష్ట్ర ఛైర్మెన్ డా. నోముల సంపత్ గౌడ్ గార్ల సూచనల మేరకు ఓటు హక్కు ప్రాధాన్యత విలువను ప్రజల దృష్టికి తీసుకుపోవాలని నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ బి.దత్తద్రి గౌడ్ సూచించారు. ఓటు హక్కు ప్రాధాన్యత పై నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్.బి దత్తాద్రి గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సమాజంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, పౌరులు తమను ఎవరు పరిపాలించాలో మరియు వారు ఎలా పరిపాలించబడతారో చెప్పడానికి వీలు కల్పిస్తుంది అన్నారు. ఓటు వేయగల సామర్థ్యం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఇది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (1948), పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (1966) ద్వారా రక్షించబడిందన్నారు. అనేక దేశాలలో, ఓటు హక్కు జాతీయ రాజ్యాంగాల ద్వారా కూడా రక్షించబడిందని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఆర్టికల్ 326 ప్రకారం హామీ ఇవ్వబడిందన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం “ప్రతి రాష్ట్రంలోన ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.