నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, హుస్నాబాద్ మాజీ కౌన్సిలర్ దొడ్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని దొడ్ల శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం హుస్నాబాద్ లోని హనుమాన్ నగర్ లో భూక్యా మోతీలాల్ నాయక్ గృహ ప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. హుస్నాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాస శ్రీనివాస్ కుమారుడు ఇటీవల బైక్ ప్రమాదం కాగా ఇంటీ కి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.