Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య శిబిరనికి విశేష స్పందన

వైద్య శిబిరనికి విశేష స్పందన

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్  : మూత్తుట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం చైర్మన్ ప్రారంభం చేశారు. శిభిరం రిజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిభిరం ఏర్పాటు చేసిన ఫైనాన్స్ వారికి పట్టణ ప్రజల తరఫున, చైర్పర్సన్ ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ముత్తూట్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్,హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్, సిబ్బంది వినయ్ విగ్నేష్, వర్ష, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -