ఎక్సైజ్ డిప్యూటీ కమిసినర్,అసిస్టెంట్ కమీషనర్,ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిజామాబాదు స్టేషన్ ఫరిధిలోని మల్కాపూర్, గొల్లగుట్ట, చక్రధర్ నగర్ తండా, నాగరం తండాల లోని పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 600 లీటర్ల గుడుంబా తయారికి ఉపయోగించే బెల్లం పానకం ను ద్వంసం చేసి కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ దశరథ గురువారం తెలిపారు. ఇట్టి దాడులలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ కిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు(Special teams) ఏర్పాటు చేసి గుడుంబా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మే వారిపైన ఉక్కు పాదం మోపుతున్నట్లు తెలిపారు. జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి కి సంబందించిన సమాచారం ఉంటే కింది నెంబర్ లకు ఫోన్ చేసి తెలియజేసిి సహకరించాలని తెలిపారు.