నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత నాస్తిక సమాజం నుంచి జాతీయ కమిటీ సభ్యులు బైరి నరేష్‌ను బహిష్కరిస్తున్నట్టు ఆ సంఘం వ్యవస్థాపక చైర్‌పర్సన్ జయగోపాల్ తెలిపారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బైరి నరేష్ నాస్తిక సమాజం నిబంధనావళి, సిద్ధాంతం, మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందున ఈ క్రమశిక్షణా చర్య తీసుకుంటున్నామన్నారు. భారత నాస్తి క సమాజం, దాని అనుబంధ సంఘాలతో ఇకపై బైరి నరేష్‌కు ఎలాంటి సం బంధాలు ఉండవనీ, ఎవరూ ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదని కోరారు.