పొంగులేటిపై ఉప్పొంగిన అభిమానం..!

– జిల్లా వ్యాప్తంగా జన్మదినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 58వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది మంది శీనన్న అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు తరలివచ్చి శీనన్నతో కట్‌ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘సప్త స్వరాలు’ ప్రత్యేకం ఖమ్మంరూరల్‌ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, శీనన్న అభిమాని తిప్పిరెడ్డి రాజశేఖ ర్‌రెడ్డి ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై రూపొందింపజేసిన పాటను ఆవిష్కరించారు. అదేవిధంగా సప్త స్వరాల పేరుతో శీనన్న ఔన్నత్యాన్ని అక్షర రూపంలో పొందుపరిచిన జ్ఞాపికను బహూకరించారు.
ఖమ్మంకార్పొరేషన్‌ : ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని స్థానిక 39వ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్‌.ఇమామ్‌ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తంబూరు దయాకర్‌రెడ్డి, తుమ్మల యుగంధర్‌లు కలిసి కేక్‌ కట్‌ చేయించి శీనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిల్లికొడు శ్రీనివాస్‌, గౌస్‌ పాషా, షేక్‌. అక్బర్‌, ఫయాజ్‌, రంజాన్‌, రవికుమార్‌, నవాజ్‌, చంటి, తాజుద్దీన్‌, మియాబారు, మడూరి సైదారావు, షేక్‌.జానీ మియా, ఒంగోలు రవీంద్ర, పంది తిరుపతిరావు,సల్మాన్‌, డివిజన్‌ యూత్‌ మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు..
పెనుబల్లి : ఆర్కే ఫంక్షన్‌హాల్‌లో పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నవీన్‌బాబు, గూడూరు మాధవరెడ్డి, బొర్రా కోటేశ్వరరావు, రాజబోయిన కోటేశ్వరరావు, రాధాకృష్ణ, కేసరి శ్రీనివాసరెడ్డి, వడ్లమూడి కృష్ణయ్య, ఎడ్ల నరసింహారావు పాల్గొన్నారు.
వైరాటౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్‌ విజయభాయి, వైరా మున్సిపాలిటీ చైర్మెన్‌ సూతకాని జైపాల్‌ కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఎర్రుపాలెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ కోట రాంబాబు, డీసీసీబీ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నరసింహారావు, ప్రతాపరెడ్డి, కడియం శ్రీనివాసరావు, శీలం శ్రీనివాసరెడ్డి, మల్లెల లక్ష్మణరావు, శీలం వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
తల్లాడ: తల్లాడలో మండల నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాేర్యక్రమంలో తల్లాడ సర్పంచ్‌ పీ.సంధ్యారాణి, నారపోగు వెంకట్‌, గోవింద్‌ శ్రీనివాసరావు, ఐలూరి కోటారెడ్డి, తుమ్మలపల్లి రమేష్‌, ఎర్రి నరసింహారావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కామేపల్లి: కామేపల్లి మండలంలో డీసీసీబీ డైరెక్టర్‌, మాజీ జెడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్‌ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నరసింహా నాయక్‌, అజ్మీర పాపియానాయక్‌, బండి నరసింహారావు, రామ్మూర్తి, మేకల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మధిర: పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా శీనన్నను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు కోట రాంబాబు మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు ఆధ్వర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్ర మార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్యతో కలిసి కేకు కట్‌ చేశారు. అనంతరం కె.వి.ఆర్‌ హాస్పిటల్‌ నందు రక్తదాన శిబిరంను ప్రారంభించారు.
ఖమ్మంరూరల్‌: కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో-చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల పరిధిలోని రెడ్డిపల్లిలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పొంగులేటి అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముత్తగూడెం సర్పంచ్‌ భుజంగరెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, తల్లంపాడు, చింతపల్లి సర్పంచులు యారసాని శివశంకర్‌ రెడ్డి, ముత్యం కృష్ణారావు పాల్గొన్నారు.
ముదిగొండ: ముదిగొండ క్యాంపు కార్యాలయంలో పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు కోట రాంబాబు, మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌ బాబు, కమలాపురం ఎంపిటిసి సభ్యులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, న్యూలక్ష్మీపురం గ్రామసర్పంచ్‌ వాకదాని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : కాటేపల్లి కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పొంగులేటి శీనన్న తనయుడు హర్ష సాయి చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేసి అదేవిధంగా అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు యాస వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మట్టూరు జనార్దన్‌, సర్పంచ్‌ మోహన్‌, పోట్రు సత్యం, దేవరపల్లి వెంకటేశ్వరరావు, చిత్తలూరు నరేష్‌, కొదమసింహం వంశీ, కప్పల బంధం జిల్లెల్ల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గోపిరెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం : ఖమ్మంలోని జీవన సంధ్యా వద్ధాశ్రమంలో మువ్వా యువసేనా బాధ్యులు సామినేని కృష్ణ చైతన్య, పునాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని సుమారు 100మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మువ్వా యువసేనా సభ్యులు కొప్పుల చంద్రశేఖర్‌, మద్ది కిశోర్‌ రెడ్డి, బోజెడ్ల రవికుమార్‌, నాగండ్ల బాబు భాస్కర్‌ పాల్గొన్నారు.

Spread the love