మతోన్మాద.. ప్యాసిస్టు పార్టీలను ఓడించాలి..

 – సీపీఐ(ఎంఎల్) ప్రజాపంధ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్
నవతెలంగాణ- ఆర్మూర్:
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు నియంత్రత్వ, మతోన్మాద పాసిస్టు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎం ఐ ఎం లను ఓడించాలని సీపీఐ(ఎం)  ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు . ప్రభాకర్ పిలుపు ఇచ్చారు.   గురువారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో ఎన్నికలపై అవగాహనా కోసం CPI(ML)ప్రజాపంథా ఎన్నికల పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ: నేడు జరుగుతున్న ఎన్నికలు ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదని  దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద పాసీజం నియంతృత్వంతో ప్రజాశ్వమిక హక్కులను, ప్రశ్నించేతతత్వం పెంచిపోసిస్తున్నారు అందుకే వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రంలో మతఉన్మాదిగా మారిన BJP దీనికి బి టీంగా పని చేస్తున్న BRS, MIM లను ఓడించాలని, ప్రజాస్వామిక హక్కులకోసం నిలబడే వారికి మద్దత్తు ఇవ్వాలని అయన కోరారు. కెసిఆర్ రెండు దపాలుగా గెలిచినా ప్రజలకు ఒరిగింది ఏమిలేదన్నారు. జిల్లాలో జిల్లలో షుగర్ ప్యాక్టరీ మూత వడ్డదని ఇప్పటికి దాని పై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎన్నికల హామీలను అమలు చెయడంలో KCR కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్నారు. ప్రజలు ఈ సారి మత్తశక్తులు అయినా బీజేపీ ఎంఐఎం నియంతృత్వ బీఆర్‌ఎస్‌ ను చిత్తుగా ఓడించి తగిన బుద్ది చెప్పాలని అయన కొరారు. కార్యక్రమంలో CPI(ML) ప్రజాపంథా  డివిజన్ కార్యదర్శి B. దేవారం, జిల్లా నాయకులు P. రామకృష్ణ, సబ్ డివిజన్ కార్యదర్శి B. కిషన్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు M. నరేందర్, నాయకులు నజీర్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love