రైతు దినోత్సవాన్ని వేడుకలను ఘనంగా నిర్వహించారు

– అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతు దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన
– పోతారెడ్డిపేట్ ,చిట్టాపూర్ రైతువేదికలో పోస్టర్ రైతు దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
– ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
తెలంగాణ రైతు దినోత్సవాన్ని రైతు వేదికల్లోఘనంగా నిర్వహించాలని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం మండలంలోని 10 రైతు వేదిక క్లస్టర్లలో రైతులతో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి కృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాష్ తో కలిసి చిట్టాపూర్ ,పోతారెడ్డిపేట రైతు వేదికలను శనివారం సందర్శించారు.అనంతరం రైతు దినోత్సవ ఏర్పాట్ల పై అధికారులకు, సర్పంచులకు ,నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికల ప్రాంగణాల్లోనూ , ప్రాంగణాల బయట వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల విశిష్టతను తెలిపే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు. రైతు వేదికల వద్ద పాల్గొనే రైతులందరికీ భోజన సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని ప్రతి రైతు వేదికలో వెయ్యి మంది రైతులతో కలిసి సమావేశం నిర్వహించి, భోజనాల ఏర్పాట్లను చేయాలన్నారు. అనంతరం వ్యవసాయంలో రైతులకు సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి సమావేశంలో తెలియజేయాలన్నారు.మన తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ అనే పేరుతో ముద్రించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పోతనక రాజయ్య, శంకరయ్య, ఎంపీటీసీ చంద్రసాగర్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్, ఎంపీడీవో భాస్కర శర్మ, ఏనగుర్తి సర్పంచ్ గుండా శంకర్, వ్యవసాయ విస్తారణ అధికారి ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.

Spread the love