రైతులు జాగ్రత్తలు పాటించండి: పోరిక జైసింగ్, స్వాతి

– ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శన
నవతెలంగాణ – తాడ్వాయి
అకాల వర్షాలు కురుస్తున్నందున, రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో స్వాతి లు అన్నారు. శనివారం మండలంలోని గంగారం, కాటాపూర్ గ్రామాల్లో గల ఎం ఎ సి ఎస్, పి పి సి, పి ఏ సి ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న ఇంకా 2, 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, రైతులందరూ వరి ధాన్యం తడవకుండా టార్పాలిన్ షీట్ లు కప్పి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని సక్రమంగా తాలు లేకుండా తూర్పాల పట్టి, ధాన్యాన్ని సక్రమంగా ఆర పెట్టాలన్నారు. తేమశాతం 13% నుండి 17% వరకు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈవో లు జిజే రవికుమార్, భవాని, రైతులు పులి నరసయ్య గౌడ్, రంగు సదయ్య, కొంకతి సమ్మయ్య, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love