రోడ్డు ప్రమాదాలు జరగకుండా రైతులు పోలీసులకు సహకరించాలి

 – జాతీయ రహదారులపై ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై ఆరబెట్టకుండా ఉండి ప్రజలు వాన దారులు ఇబ్బంది పడకుండా చూడాలి
 – రైతు సోదరులకు విజ్ఞప్తి చేసిన నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్
నవతెలంగాణ- కంటేశ్వర్ :
రైతు సోదరులకు విజ్ఞాప్తి చేయునది ఏమనగా నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కోతలు జరుగుతు న్నందున అట్టి వరి ధాన్యం ఎండలో ఆరబెట్టడానికి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు సర్వీసురోడ్డులలో అట్టి వరి ధాన్యం ఎండబెట్టుకోవడానికి వాడుకుంటుంన్నందున గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సోదరులకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శుక్రవారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో చాలా మంది తమ విలువైన ప్రాణాలను సైతం వదులుతున్నారు. చాలా మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. ఉదహరణకు ముగుపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేది 3-11-2023 నాడు కాస్బాగ్ తాండ రోడ్డులో వరి ధాన్యాలు ఆరబెట్టడం వలన ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న మహిళా ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇట్టి వరి ధాన్యం ఎండబెట్టిన యాజమాని బాధావత్ గణపతి పై అండర్ సెక్షన్ 304 ఐ.పి.సి ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. ఇట్టినేరానికి హత్యా నేరం సమానంగా పరిగణించబడును అని తెలియజేశారు. దీనికి గాను 10 సంవత్సరాల వరకు కఠిన కారాగారా శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.నిజామాబాద్ జిల్లాలో గతంలో వరి ధాన్యం ఆరబెట్టడం ద్వారా జరిగిన ప్రమాదాల యొక్క వివరాలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. 2021 సంవత్సరంలో మొత్తం కేసులు 04 నమోదు చేయడం జరిగిందని అందులో ముగ్గురు మృతి చెందగా క్షతగాత్రులు ఒకరు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా 2022 సంవత్సరంలో మొత్తం కేసులు 06 నమోదు చేయగా ఐదుగురు మృత్యువాత పడ్డారని ఒకరు క్షతగాత్రులుగా చికిత్స పొందారని తెలియజేశారు. 2023 వ సంవత్సరo 11వ నెల 8వ తేదీ వరకు మొత్తం కేసులు నమోదు 05 కాగా నలుగురు మృత్యువాత పడ్డారని ముగ్గురు క్షతగాత్రులుగా చికిత్స పొందారని మూడు సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాలపై క్లుప్తంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వివరించారు.
 ఇలా వరి దాన్యం ను రోడ్డుపై ఆరబెట్టడం వలన జరిగే ప్రమాదాలపై భారతదేశ శిక్ష స్మృతి ( ఐపిసి) ప్రకారంగా మీ పై చట్ట రీత్య చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. అండర్ సెక్షన్ 304 -॥ ఐ.పి.సి ప్రకారం ఇలా ఆరబెట్టిన ధాన్యల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవ్వరయిన మరణించినచో, అట్టి ఆరబెట్టిన యాజమానికి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అంతే కాకుండా కేసు విచారణ అనంతరం 10 సంవత్సరాల జైలు శిక్ష / జరిమాన విధించే ఆస్కారం ఉందన్నారు. అదేవిధంగా అండర్ సెక్షన్ 188 ఐ.పి.సి ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వరి ధాన్యం జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై ,సర్వీసు రహదారులపై ఆరబెట్టినందున అట్టి యాజమానికి 6 నెలల జైలు శిక్ష / 1000 రూపాయల జరిమాన విధించడం జరుగుతుందన్నారు.అండర్ సెక్షన్ 283 ఐ.పి.సి ప్రకారం ఎదైన పబ్లిక్ మార్గాంలో వరి ధాన్యం ఆరబెట్టడం ద్వారా ఏదైన వ్యక్తికి ప్రమాదం, ఆటంకం లేదా గాయం కలిగినట్లయితే అట్టి వారిపై కోర్టు వారి ద్వారా శిక్షించబడుతారు.అండర్ సెక్షన్ 341 ఐ.పి.సి ప్రకారం మీరు జాతీయ రహదారులపై వరిధాన్యం ఆరబెట్టినందుకు చర్యలు తీసుకోబడును, దీనికి గాను అట్టి ఆరబెట్టిన యాజమానికి 1 నెల జైలు శిక్ష / 500 రూపాయల జరిమాన విధించే ఆస్కారం గలదు.అండర్ సెక్షన్ 337 ఐ.పి.సి ప్రకారం ఇలా ఆరబెట్టిన ధాన్యల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి సాధారణ గాయం అయినచో, అట్టి ఆరబెట్టిన యాజమానికి 6 నెలల జైలు శిక్ష/ 500 రూపాయల జరిమాన విధించే ఆస్కారం గలదు. అండర్ సెక్షన్ 338 ఐ.పి.సి ప్రకారం ఇలా ఆరబెట్టిన ధాన్యల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర గాయలు అయినచో, అట్టి ఆరబెట్టిన యాజమానికి 2 సంవత్సరాల జైలు శిక్ష / 1000 రూపాయల జరిమాన విధించే ఆస్కారం గలదు.పి.డి.పి.పి యాక్టు సెక్షన్ 3 ప్రకారంగా ఎవ్వరయిన ప్రజల యొక్క ఆస్తులు అనగా రోడ్లు, భవనాలు  ఇతర ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసిన ఆస్తులను అనగా పబ్లిక్ రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడం వలన రోడ్లు ద్వంసం అయ్యే అవకాశాలు ఉన్నందున సదరు యాజమాన్యం పై ఈ సెక్షన్ ప్రకారంగా కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. కావున రైతు మిత్రులకు విజ్ఞాప్తి చేస్తున్నామన్నారు. వరి ధాన్యాలను ఎట్టి పరిస్థితిలో మీరు జాతీయ రహదారులు గాని దాన్ని ఆనుకొని ఉన్న సర్వీసు రోడ్డులపైన గాని లేక ఏ ఇతర పబ్లిక్ రహదారులపై గాని ఆరబెట్టకుండా ఉండి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని తెలియజేశారు.
Spread the love