Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: ఆర్డిఓ

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండల కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రాలను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బాబురావుకు ఆదేశించారు. కొనుగోలు త్వరితగతిన పూర్తి కావడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆర్డీవో సూచించారు. పండించిన పంటలు రైతులు దళారులకు అనుకోకుండా మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోని అమ్ముకొని మద్దతు ధరలు సద్వినియోగం పంచుకోవాలని ఆర్డీవో రైతులను కోరారు. ఆర్డిఓ వెంట డోంగ్లి తాసిల్దార్ రంజిత్ కుమార్ అలాగే డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బాబురావు సింగిల్ విండో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -