కోన సముందర్ సొసైటీకి తాళం వేసిన రైతులు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ సింగిల్ విండో లో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొంటూ  రైతులు విండో కార్యాలయానికి  తాళం వేశారు. శనివారం విండో చైర్మన్ సామా బాపురెడ్డి అధ్యక్షతన విండో మహాజన సభను నిర్వహించారు. సభకు హాజరైన రైతులు విండో కార్యదర్శి రాజేశ్వర్  చదివి వినిపించిన  లెక్కలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా విండోకు కమిషన్ల  రూపంలో వచ్చిన డబ్బుల విషయంలో కార్యదర్శి రాజేశ్వర్ సరైన లెక్కలు చూపడం లేదని ఆరోపించారు. సొసైటీలో సుమారు కోటి వరకు అక్రమాలు జరిగాయని కోరుకుంటూ రైతులు  కార్యదర్శిని నిలదీశారు. సరైన లెక్కలు చెప్పకుండా పొంతన లేని  సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన రైతులు సొసైటీ కి తాళం వేశారు. సీఈఓ ని సస్పెండ్ చేసే వరకు తాళం తీయమని రైతులు పేర్కొన్నారు. అనంతరం విండో చైర్మన్ సామా బాపురెడ్డి, డైరెక్టర్లు రైతులతో కలిసి జిల్లా సహకార సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలో విండో లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.
Spread the love